మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. రుణ సమస్య నుంచి బయటపడతారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం ఉండదు. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మనోధైర్యంతో వ్యవహరించండి. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ముఖ్యుల కలయిక సాధ్యపడదు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. లౌక్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి.
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు విపరీతం. సాయం ఆశించి భంగపడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పొదుపు ధనం అందుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలకు దీటుగా స్పందిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు వేగవంతమవుతాయి. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. ఆప్తులతో ఉల్లాంగా గడుపుతారు.
చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. రుణ ఒత్తిళ్లు అధికమవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పెద్దల సలహా పాటిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.
ఆశావహ దృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు.
మీ కష్టం ఫలిస్తుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.