అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. దుబారా ఖర్చులు విపరీతం. బాధ్యతలు అప్పగించవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. రాబడిపై దృష్టిపెడతారు. అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. విందులకు హాజరవుతారు.
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. భేషజాలకు పోవద్దు. చాకచక్యంగా వ్యవహరించాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు చురుకుగా సాగుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమించినా ఫలితం ఉండదు. మీ సాయం పొందిన వారే విమర్శిస్తారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీ మాటకు స్పందన లభిస్తుంది. బంధుమిత్రులు చేరువవుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. సేవా సంస్థలకు సాయం అందిస్తారు.
సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ధనలాభం ఉంది. సన్నిహితులను ఆదుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. జూదాలు, బెట్టింగ్ జోలికిపోవద్దు.
సంప్రదింపులు ఫలించవు. ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ధనలాభం ఉంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేస్తారు. అందరితోను సత్సంబంధాలు నెలకొంటాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండండి.
పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి ఫలిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది.
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ కష్టం ఎదుటివారికి కలిసివస్తుంది. అన్యమస్కంగా గడుపుతారు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు.
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పరిచయాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవకాశాలను నద్వినియోగం చేసుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు తగిన సమయం. బాధ్యతగా మెలగాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు విపరీతం. అపరిచితులతో జాగ్రత్త. పనులు పురమాయించవద్దు. పెద్దలల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.