అనీల్ గారూ... ఆదిత్యుడిని మంకెన పూలతో పూజించండి

మంగళవారం, 31 జులై 2012 (17:18 IST)
FILE
పి. అనీల్-గణపతి నగరం:

మీరు చవితి, శుక్రవారం, మకరలగ్నం, మఖనక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. లగ్నము నందు శుక్ర, శని, రాహువులు ఉండటం వల్ల విద్యాకారకుడైన బృహస్పతి ఉచ్ఛి చెంది ఉండటం వల్ల మీరు సాంకేతిక రంగాలలో బాగా రాణిస్తారు. మీ 25వ సంవత్సరము వరకు విద్యాయోగం ఉన్నందువల్ల చదువును కొనసాగించండి. శుభం కలుగుతుంది.

24 లేక 25 సంవత్సరము నందు బాగా స్థిరపడతారు. 2014 నుంచి రవిమహర్దశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్ధశ పది సంవత్సరాలు, కుజ మహర్ధశ ఏడు సంవత్సరాలు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. ఆదిత్యుడిని మంకెన పూలతో పూజించడం వల్ల స్థిరబుద్ధి అభివృద్ధి చేకూరుతుంది.

వెబ్దునియా పై చదవండి