మీరు నవమి గురువారం, కన్యాలగ్నము, శ్రవణ నక్షత్రం, మకరరాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు శని, చంద్ర, రాహువులు ఉండటం వల్ల 2014 లేక 2015నందు సంతాన యోగం కలదు. అప్పుడప్పుడు, ఉదరానికి సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు.
1999 నుంచి రాహు మహర్థశ ప్రారంభమయ్యింది. ఈ రాహువు 2014 ఎప్రిల్ నుంచి 2017 వరకు యోగాన్ని ఇస్తుంది. తదుపరి గురు మహర్థశ 16 సం||ములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు. ప్రతీ రోజూ పుత్ర గణపతిని ఆరాధించినా మీ సంకల్పం సిద్ధిస్తుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి