మీరు పంచమి బుధవారం, తులా లగ్నము, పుష్యమి నక్షత్రం కర్కాటకరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల 3 నెలలకు ఒక శనివారంనాడు శనికి తైలాభిషేకం చేయించి 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించినా శుభం కలుగుతుంది.
భార్యాస్థానాధిపతి అయిన కుజుడు ద్వితీయము నందు రవి, బుధ, శుక్ర, రాహువులతో కలియిక వల్ల వివాహ ప్రతిబంధకా దోషం ఏర్పడింది. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అని గమనించండి.
భారతి : పంచమి ఆదివారం, మీనలగ్నము, శతభిషా నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. వర్తమాన కాలం అనుకూలంగానే ఉంది. ఇద్దరి జాతక పొంతన సామాన్యంగా ఉంది. ఇద్దరికీ 16 పాయింట్లు కుదిరాయి.