మీరు దశమి బుధవారం, ధనుర్ లగ్నము, రేవతి నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి వేప నూనెతో శనికి దీపారాధన చేసినా దోషాలు తొలగిపోతాయి.
కుటుంబాధిపతి అయిన శనిని కేతువు పట్టడం వల్ల, కళత్ర కారకుడైన శుక్రుడు రాహువుతో కలయిక వల్ల భర్తస్థానము నందు బుధ, కుజులు ఉండటం వల్ల వివాహం మీకు ఆలస్యమైంది. 2014 నందు మీకు వివాహం అవుతుంది.
తూర్పు నుంచి కానీ, పడమర నుంచి కానీ సంబంధం స్థిరపడగలదు. ఉమామహేశ్వరుల కళ్యాణం చేయించండి. ఆటంకాలు తొలగిపోతాయి.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.