రిటైర్మెంట్ తర్వాత ఆ పని చేస్తానంటున్న కేంద్రం హోం మంత్రి అమిత్ షా!

ఠాగూర్

బుధవారం, 9 జులై 2025 (20:04 IST)
కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తానని వెల్లడించారు. ప్రజా జీవనం నుంచి వైదొలగిన అనంతరం భవిష్యత్ ప్రణాళికపై ఓ క్లారిటీ ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెడతానని చెప్పాు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 
 
రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నా. రసాయన ఎరువులతో పండించే పంటలతో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందన్నారు. 
 
సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు. హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినపుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ ఉన్నారు. కానీ, సహకార శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినపుడు మాత్రం హోం శాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని నేను భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని రైతులు, పేదలు, గ్రామాలు, పశు సంపద కోసం పనిచేస్తుందని అని మంత్రి  అమిత్ షా పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు