రాజేష్ గారు.. ప్రతి శవివారం పచ్చని పూలతో శనిని పూజించండి

శనివారం, 16 మార్చి 2013 (18:24 IST)
FILE
రాజేష్ గారు-తణుకు:

మీరు తదియ మంగళవారం, తులా లగ్నము, ఆశ్లేష నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి పచ్చని పూలతో శనిని పూజించి అర్చించండి.

ఏదైనా విద్యాసంస్థలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో కానీ, దేవాలయాలలో కానీ బొప్పాయి చెట్టును నాటండి మీకు శుభం కలుగుతుంది. లాభస్థానము నందు శని, రాహువులు ఉండటం వల్ల ఈ రోజువరకు సరియైన అభివృద్ధి లేకపోయింది. 2012 అక్టోబరు నుంచి చంద్రమహర్థశ ప్రారంభమయింది.

ఈ చంద్రుడు 2014 నుంచి 2022 వరకు సత్‌ఫలితాలను ఇస్తాడు. మీ పేరుతో ఏజెన్సీ, టెక్నికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సంస్థలకు సంబంధించిన వ్యాపారాలు 2014 నుంచి కలిసిరాగలవు. లక్ష్మీగణపతిని ఆరాధించినా శుభం, పురోభివృద్ధి పొందుతారు.

అనిపుద్ :- సప్తమి సోమవారం మకరలగ్నము, శ్రవణ నక్షత్రం, మకరరాశి నందు జన్మించారు. మీ ఇద్దరి జాతక పొంతన బాగుంది. ఇద్దరికీ 25 పాయింట్లు కలిసాయి. ముందుకు సాగినా శుభం కలుగుతుంది.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి

వెబ్దునియా పై చదవండి