లక్ష్మీమౌనికగారూ... ఇవి మీ కుటుంబ సభ్యుల జాతక వివరాలు....
మంగళవారం, 18 సెప్టెంబరు 2012 (19:31 IST)
WD
లక్ష్మీమౌనిక - ప్రొద్దుటూరు : మీరు త్రయోదశి శుక్రవారం, వృషభ లగ్నము, పుబ్బ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. లగ్నము నందు బృహస్పతి ఉండటం వల్ల, మీ పేరుతో వ్యాపారాలు బాగుగా కలిసివస్తాయి. ఈ సంవత్సరము ఆగష్టుతో శనిదోషం తొలగిపోయింది. 2013 నుంచి సత్కాలం ప్రారంభమవుతుంది. 2013 నుంచి 10 సంవత్సరములు చంద్ర దశ, 7 సంవత్సరముల కుజ దశ, 18 సంవత్సరముల లాభదశ మంచి యోగాన్ని అభివృద్దినివ్వగలదు. లలిత కవచం చదివినా లేక విన్నా మీకు ఆటంకాలు తొలగిపోతాయి.
మీ పెద్ద కుమార్తె శ్రీచందన త్రయోదశి శనివారం, సింహలగ్నము, ఉత్తరభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. అష్టమ స్థానము నందు బుధ, శుక్ర, కుజ, గురు, చంద్రులు ఉండటం వల్ల, అప్పుడప్పుడు ఆరోగ్యములో చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ మాసశివరాత్రికి ఈశ్వరుని అభిషేకం చేయించినా శుభం కలుగుతుంది. వీరు సాంకేతిక, ఎం.బి.ఏ., వంటి రంగాలలో బాగుగా రాణిస్తారు. 24 సంవత్సరముల నందు ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిరపడతారు. 24 లేక 25 సంవత్సరాల నందు వివాహం అవుతుంది. దక్షిణామూర్తిని ఆరాధించినా విద్యాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి చేకూరుతుంది.
మీ చిన్న కుమార్తె కిరణ్మయి ఏకాదశి సోమవారం, కన్యాలగ్నము, మృగశిరా నక్షత్రం, మిథునరాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల, గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల, వాసుకీ కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. ఈమె 5 సంవత్సరం వరకు ఆరోగ్యములో చిన్న చిన్న సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. సైన్సు రంగాలలో బాగుగా రాణిస్తారు. 23 లేక 24 సంవత్సరాల నందు కార్పోరేట్ సంస్థల యందు స్థిరపడతారు. 24 లేక 25 సంవత్సరాల నందు వివాహం అవుతుంది. వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి. కార్తికేయుడిని పూజించడం వల్ల కలిసిరాగలదు.
మీ భర్త వెంకట కిరణ్ ఏకాదశి శనివారం, సింహలగ్నము, ఆరుద్ర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. మీది, మీ రెండో కుమార్తెది ఏకరాశి అవ్వడం వల్ల, ఏకరాశి దోష శాంతి చేయించండి. శుభం కలుగుతుంది. అర్ధాష్టమ శనిదోషం తొలగిపోయింది. స్థిరలక్ష్మీదేవిని చామంతి పూలతో పూజించడం వల్ల ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. 2001 నుంచి శని మహర్థశ ప్రారంభమయింది. ఈ శని 2013 సెప్టెంబరు నుంచి 2020 వరకు మంచి యోగాన్ని ఇవ్వగలదు.