సురేఖ -మీరు ఏకాదశి గురువారం, తులాలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము ఆగస్టుతో అష్టమ శనిదోషం తొలగిపోతుంది. భర్తస్థానము నందు రవి ఉచ్ఛి చెందడం వల్ల, భర్తస్థానాధిపతి అయిన కుజుడు కేతువుతో కలయిక వల్ల వివాహ విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కొన్నా సమసిపోగలవు. మంచి యోగ్యుడు, విద్యావంతుడు, ఉత్తముడైన భర్త లభిస్తాడు. కర్కోటక కాల సర్పదోష శాంతి చేయించండి.