బండి గీతాసాయి-జగ్గయ్యపేట: మీరు పూర్ణిమ శుక్రవారం, వృషభ లగ్నము, ధనిష్ట నక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. లగ్నము నందు బృహస్పతి ఉండటం వల్ల ధనాధిపతి అయిన బుధుడు ఉచ్ఛి చెంది ఉండటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం తొందరపాటు నిర్ణయాలు మంచివి కావని గమనించండి. కార్తికేయుడిని ఎర్రని పూలతో పూజించడం వల్ల మనోసిద్ధి చేకూరుతుంది. 2010 నుంచి గురు మహర్దశ ప్రారంభిమయింది. ఈ గురువు 2016 నుంచి 2026 వరకూ యోగాన్ని ఇవ్వగలడు. దేవాలయంలో జమ్మి చెట్టును నాటిన శుభం కలుగుతుంది. అప్పుడప్పుడు మెడ, తల, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యములో జాగ్రత్త అవసరం.