ఎం. శివరామకృష్ణ-పొన్నూరు: మీరు పూర్ణిమ మంగళవారం, కర్కాటక లగ్నము, రోహిణి నక్షత్రం వృషభ రాశి నందు జన్మించారు. లగ్నాధిపతి అయిన చంద్రుడు ఉచ్ఛి చెంది ఉండటం వల్ల మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. దయ, మంచి గుణం, చురుకుతనం, పని యందు ధ్యాస కలిగినవారుగా ఉంటారు. అప్పుడప్పుడు ఆరోగ్యములో చిన్నచిన్న సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఐశ్వర్య ప్రదాత అయిన ఈశ్వరుని పూజించడం వల్ల సర్వదా పురోభివృద్ధి చెందుతారు. 2014 జూన్ నుంచి శని మహర్దశ ప్రారంభమైంది. ఈ శని 19 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తాడు. ఏదైనా దేవాలయంలో లేదా ఉద్యానవనంలో నేరేడు చెట్టును నాటిన శుభం కలుగుతుంది.