విజయలక్ష్మి-విజయవాడ: మీరు సప్తమి, బుధవారం కర్కాటక లగ్నం, విశాఖ నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల, నెలకు ఒక శనివారం నాడు 16 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి నీలపు శంకుపూలతో శనిని పూజించిన దోషాలు తొలగిపోతాయి. 2016 ఏప్రిల్ తదుపరి మీరు బాగుగా స్థిరపడుతారు. 2017 డిశెంబరు లోపు మీకు సామాన్యమైన అభివృద్ధి ఉంటుంది. 2018 లేక 2019 నందు గృహనిర్మాణం చేస్తారు. 2019 నుండి కేతు మహర్దశ 7 సంవత్సరములు, శుక్రుడు 20 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని పొందుతారు. ఏదైనా దేవాలయంలో మొగలి చెట్టును నాటిన శుభం కలుగుతుంది. లక్ష్మీనారాయణుని ఆరాధించడం వల్ల మనోసిద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది.
మీ కుమారుడు హేమంత్ కుమార్ సప్తమి, ఆదివారం, వృషభలగ్నం, పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. 2016 డిశెంబరు వరకూ చదువులో ఏకాగ్రత చాలా అవసరం. 90 శాతం మార్కులు ఆశిస్తే 60 శాతం మాత్రమే పొందుతారు. అందువల్ల ఏకాగ్రత, ధ్యాస, ధ్యేయం చాలా అవసరమని గమనించండి. 2020 వరకూ విద్యాయోగం ఉన్నందువల్ల పైచదువులు కొనసాగించిన శుభం కలుగుతుంది. తాత్కాలికంగా విదేశాలు వెళ్లే అవకాశం ఉన్నది. మీ కుమారుడు 24 లేదా 25 సంవత్సరము నందు ఉన్నతస్థితిలో స్థిరపడతారు. దక్షిణామూర్తిని ఆరాధించిన సర్వదాశుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది. 2017 సెప్టెంబరు నుండి కేతు మహర్దశ 7 సంవత్సరములు, శుక్రుడు 20 సంవత్సరములు మొత్తం 27 సంవత్సరములు మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్నది.