ఏడుకొండలు-మణుగూరు: మీరు త్రయోదశి సోమవారం, ధనుర్ లగ్నము, పూర్వాషాఢ నక్షత్రం, ధనుర్ రాశి నందు జన్మించారు. ధనుర్ లగ్నము, ధనుర్ రాశి అవడం వల్ల మంచి ఆలోచనాపరులు, విజ్ఞానవంతులు, వస్తువుల పట్ల, ఆర్థిక విషయాల పట్ల ఆసక్తి కలిగినవారు, సున్నిత మనస్కులుగా ఉంటారు. 2022 వరకూ ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి తెల్లని పూలతో శనిని పూజించండి. 3 నెలలకు ఒక శనివారంనాడు శనికి తైలాభిషేకం చేయించి ఏదైనా దేవాలయంలో నిమ్మ చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి. 2018 నుంచి రాహు మహర్దశ 18 సంవత్సరములు మంచి యోగాన్ని, ఆర్థికాభివృద్ధిని, పురోభివృద్ధిని, సంకల్పసిద్ధిని చేకూర్చుతుంది. లక్ష్మీగణపతిని ఆరాధించడం వల్ల మీ కోర్కెలు నెరవేరుతాయి.