నాగరాజు-యుఎస్ఎ: మీరు పంచమి ఆదివారం సింహలగ్నము, కృత్తిక నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. ఉద్యోగ స్థానము నందు చంద్రుడు ఉండటం వల్ల 2015 డిసెంబరు తదుపరి మీ అభివృద్ధికి మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. 2016 ఫిబ్రవరి తదుపరి మీరు బాగుగా స్థిరపడ్డారు. 2016 లేక 2017 నందు సంతానయోగం ఉంది. 2013 అక్టోబరు నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 16 సంవత్సరములు 61 శాతం యోగాన్ని ఇస్తుంది. 2016 నుంచి 2029 వరకు యోగాన్ని అభివృద్ధిని పొందుతారు. విదేశాలలో కంటే స్వదేశంలో బాగుగా అభివృద్ధి చెందుతారు. ప్రతిరోజు సూర్యస్తుతి చేయండి. శుభం కలుగుతుంది.