సాయిరంగనాథ్-ఒంగోలు: మీరు అమావాస్య ఆదివారం, వృశ్చిక లగ్నము, ఆశ్రేష నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. భాగ్య స్థానము నందు రవి, బుధ, చంద్ర, రాహువులు ఉండటం వల్ల, ఉద్యోగ స్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల మీరు ఎందులోనూ స్థిరపడలేదు. 2017 మార్చి తదుపరి మీకు మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. 2001 నుంచి శుక్ర మహర్దశ ప్రారంభమైంది.
ఈ శుక్రుడు 2017 నుంచి 2021 వరకూ యోగాన్ని, అభివృద్ధిని పురోభివృద్ధిని ఇస్తాడు. 2021 నుంచి రవి మహర్దశ 6 సంవత్సరములు, చంద్ర మహర్దశ 10 సంవత్సరములు ఇదే యోగాన్ని కొనసాగింపు జరుగుతుంది. ప్రతిరోజూ శ్రీమన్నారాయణుడిని అర్చించి ఆరాధించండి. దేవాలయంలో బొప్పాయి చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి.