2017 వరకూ అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించి నూపుపువ్వులతో శనిని పూజించి, అర్చించినట్లయితే దోషాలు తొలగిపోతాయి. గ్రహాలన్నీ రాహు,కేతువుల మధ్య బంధించబడటం వల్ల వాసుకీ కాల సర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషాలకు శాంతి చేయించిన శుభం కలుగుతుంది. 2019 అక్టోబరు వరకు కుజ మహర్దశ మీకు సామాన్యంగా ఉండగలదు. 2019 అక్టోబరు నుంచి రాహు మహర్దశ ప్రారంభమవుతుంది. ఈ రాహువు 18 సంవత్సరములు 63 శాతం యోగాన్ని ఇవ్వగలదు. ఆర్థికంగా, ఆరోగ్యంగా దినదినాభివృద్ధి పొందుతారు. ప్రతిరోజు కార్తికేయుడిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది.