శ్రీనాధ్ వేది-తిరుపతి: మీరు ఏకాదశి శుక్రవారం, ధనుర్ లగ్నము, జ్యేష్ట నక్షత్రము, వృశ్చిక రాశి నందు జన్మించారు. రాజ్య లేక ఉద్యోగ స్థానము నందు శుక్ర, కేతువులు ఉండటం వల్ల కేతు బంధన దోషం ఏర్పడం వల్ల ఎందులోనూ స్థిరపడలేకపోవడం, ఒడిదుడుకులు, అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటున్నారు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి చామంతి పూలతో కానీ, సువర్ణ గన్నేరు పూలతో కానీ శనిని పూజించిన దోషాలు తొలగిపోతాయి.
2016 ఏప్రిల్ తదుపరి మీ అభివృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వల్ల పురోభివృద్ధి చెందుతారు. 2014 నుంచి రవి మహర్దశ ప్రారంభమైంది. ఈ రవి 2016 ఏప్రిల్ నుంచి 2020 వరకు యోగాన్ని ఇవ్వగలదు. తదుపరి చంద్ర మహర్దశ 10 సంవత్సరములు, తదుపరి కుజ మహర్దశ 7 సంవత్సరములు మీకు మంచి భవిష్యత్తు ఉంది. సంఘంలో మంచి పేరు ఖ్యాతి గడిస్తారు. వైష్ణవ దేవాలాయాల్లో కొబ్బరి చెట్టును నాటిని శుభం కలుగుతుంది.