జి.వెంకటరాఘవ-చెర్లపల్లి: మీరు త్రయోదశి శనివారం, మకర లగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం, ధనుర్ రాశి నందు జన్మించారు. 2022 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. ఏదైనా ఉద్యానవనంలో కానీ, ఆలయాల్లో కానీ పనస చెట్టును నాటిన శుభం కలుగుతుంది.2016 లేక 2017 నందు పుత్రుడు కలిగే అవకాశం సామాన్యంగా ఉంది.
2005 నుంచి రాహు మహర్దశ ప్రారంభమయింది. ఈ రాహువు 2016 మే నుంచి 2023 వరకూ 50 శాతం యోగాన్ని ఇస్తుంది. ఇందు మీరు బాగుగా స్థిరపడతారు. ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి ఉంటుంది. ఆదిత్యుడిని పూజించడం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది. 2023 నుంచి గురు మహర్దశ 23 సంవత్సరములు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. పితృకారుకుడైన రవి అష్టమము నందు ఉండటం వల్ల మీ తల్లి, తండ్రి ఆరోగ్యములో జాగ్రత్త అవసరం. కుటుంబీకుల పట్ల ప్రేమా, అభిమానాన్ని కనబరచండి.