ఎ.శ్రీదేవి-పొన్నూరు: మీరు చవితి మంగళవారం, వృశ్చిక లగ్నము, ఆరుద్ర నక్షత్రం, మిధునరాశి నందు జన్మించారు. అష్టమ స్థానము నందు గురు, చంద్రులు ఉండటం వల్ల కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యములో జాగ్రత్త అవసరం. అన్నపూర్ణాష్టకం చదివినా లేక విన్నా శుభం కలుగుతుంది. మీ సంతానం చదువుల్లో నెమ్మదిగా పురోభివృద్ది చెందుతారు. 2013 నుంచి బుధ మహర్దశ ప్రారంభమైంది. ఈ బుధుడు 17 సంవత్సరములు 58 శాతం యోగాన్ని ఇస్తాడు. ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వెళ్లినా అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో అర్చించడం వల్ల మనోసిద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది. ఉద్యానవనాల్లో చింతచెట్టును నాటిన శుభం కలుగుతుంది.