ఎస్.భవ్యతులసి-వనస్థలిపురం: మీరు తదియ మంగళవారం, మేష లగ్నము, మూల నక్షత్రం ధనుర్ రాశి నందు జన్మించారు. 2022 వరకూ ఏల్నాటి శనిదోషం అధికం ఉన్నందువల్ల ప్రతి శనివారం 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లిని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. ధన, భర్త స్థానాధిపతి శుక్రుడు స్వక్షేత్రము నందు ఉండటం వల్ల మంచి యోగ్యుడు, ఉత్తముడు, విద్యావంతుడైన భర్త లభిస్తాడు. 2016 ఫిబ్రవరి నుంచి డిసెంబరు లోపు మీకు వివాహం అవుతుంది. తూర్పు నుంచి కానీ పడమర నుంచి కానీ సంబంధం స్థిరపడుతుంది. శ్రీమన్నారాయణుడిని తులసీ దళాలతో పూజించడం వల్ల శుభం, జయం , పురోభివృద్ధి కానరాగలదు. ఉద్యానవనాల్లో వేగి చెట్టును నాటండి. మీకు శుభం కలుగుతుంది.