మీరు త్రయోదశి శుక్రవారం, వృషభలగ్నము పుబ్బ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. మీకు ఏలినాటి శనిదోషం తొలగిపోయింది. 2012 ఆగష్టు వరకు శని ప్రభావం ఉండటం వల్ల ప్రతీ చిన్న విషయానికి ఆందోళన చెందటం, చికాకులు వంటివి ఉండగలవు. సూర్యభగవానుని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది. 2014 నుంచి సత్‌కాలం ప్రారంభమవుతుంది. సద్వినియోగం చేసుకోండి.
మీ భర్త :- ఏకాదశి శనివారం సింహలగ్నము, ఆరుద్ర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. మీ భర్తకు 2012 ఆగష్టు నుంచి యోగప్రదమైన కాలం ప్రారంభమవుతుంది. 2001 నుంచి శని మహర్ధశ ప్రారంభమయింది. ఈ శని 2012 ఫిబ్రవరి నుంచి 2020 వరకు యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు.
మీ కుమార్తె చందన :- త్రయోదశి శనివారం, సింహలగ్నము, ఉత్తరభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ మాసశివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం చేయించి తీర్థం తీసుకొన్నట్లైతే ఆరోగ్యము అభివృద్ధి చేకూరుతుంది. మీ 15 సం||ము నుంచి సత్‌కాలం ప్రారంభమవుతుంది. సైన్సు, సాంకేతిక రంగాలలో రాణిస్తారు. మీ 24 సం||ము నందు బాగా రాణిస్తారు. మీ 25 సం||ము నందు వివాహం అవుతుంది.