రాజా నరేన్- విజయవాడ : మీరు పాడ్యమి ఆదివారం, వృశ్చిక లగ్నము, చిత్త నక్షత్రం, తూలారాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల ఒక సంబంధం అనుకొని ఆగిన తదుపరి మీకు వివాహం అవుతుంది. అష్టమస్థానం నందు రాహువు ఉండి, గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడి ఉండటం వల్ల, కర్కోటకకాలసర్పదోషం ఏర్పడటం వల్ల, ఈ దోషానికి శాంతి చేయించినా శుభం కలుగుతుంది.
2017 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించినా శుభప్రదంగా ఉంటుంది. 2003 నుంచి గురు మహర్దశ ప్రారంభమయింది. ఈ గురువు 2013 నుంచి 2019 వరకు యోగాన్ని ఇస్తుంది.
ప్రతీ రోజూ వరసిద్ధివినాయకుడి పూజించడం వల్ల సంకల్పం సిద్ధిస్తుంది. 2017 వరకు ఉద్యోగం చేయండి. వివాహానంతరం మీ భార్య పేరుతో వ్యాపారాలు బాగుగా కలిసిరాగలవు. స్వదేశంలో బాగుగా అభివృద్ధి చెందుతారు.