దివ్యభారతి గారూ.. రాహు-కేతువులకు శాంతి చేయించండి..
FILE
దివ్యభారతి - ఒంగోలు
మీరు పాడ్యమి ఆదివారం, తులా లగ్నము, అనూరాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏల్నాటి లగ్నము శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ 3 నెలలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించి 19 సార్లు నవగ్ర ప్రదక్షణ చేసినా సర్వదోషాలు తొలగిపోతాయి.
గ్రహాలన్ని రాహు, కేతువుల మధ్య బంధించబడటంవల్ల మహాపద్మకాల సర్పదోషానికి శాంతి చేయించినా సర్వదా శుభం కలుగుతుంది. 2014 లేక 2015 నందు మీరు ఉన్నతస్థితిలో స్థిరపడతారు. 2014 ఆగష్టు నుంచి శుక్ర మహర్థశ 20 సం||ములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. ప్రతీ రోజు శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో పూజించడం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి