మీరు చవితి సోమవారం, తులా లగ్నము, అనూరాధ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ 3 నెలలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించి నీలపు పూలతో శనిని అర్చించినా దోషాలు తొలగిపోతాయి.
లగ్నము నందు కేతువు, యముడు ఉండి, భర్తస్థానము నందు కుజ, రాహువులు ఉండి, గ్రహబంధన దోషం ఏర్పడటంవల్ల, వివాహ ప్రతిబంధకా దోషం ఏర్పడటంవల్ల, తక్షక కాలసర్పదోషం ఏర్పడటంవల్ల, ఈ దోషాలకు శాంతి చేయించినా మీకు శుభం కలుగుతుంది.
2014 నందు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 2013 నుంచి కేతు మహర్థశ ప్రారంభమయింది. ఈ కేతువు 2014 నుంచి 2020 వరకు యోగాన్నిఇస్తుంది.
తదుపరి శుక్ర మహర్థశ 20 సం||ములు మంచి అభివృద్ధిని ఇవ్వగలదు. 2014 లేక 2015 నందు సంతాన ప్రాప్తి కలదు. ప్రతీ రోజు సంకల్పసిద్ధిగణపతిని ఆరాధించినా మీ ఆటంకాలు తొలగి, మీ సంకల్పం సిద్ధిస్తుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి