రాఘవేంద్ర-ముంబాయి: మీరు నవమి మంగళవారం, మకర లగ్నము, అనూరాధ నక్షత్రం, వృశ్చిక నందు జన్మించారు. లగ్నము నందు కేతువు ఉండి, భాగ్యాధిపతి అయిన బుధుడు భార్యస్థానము నందు ఉండటం వల్ల, భాగ్యధిపతి అయిన బుధుడ్ని రాహువు పట్టడం వల్ల, తక్షక కాలసర్పదోషం ఏర్పడటం వల్ల, ఆర్థిక ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటున్నారు.
మీరు విదేశాలలో కన్నా స్వదేశంలో బాగుగా రాణిస్తారు. వివాహం కాకుండా మీకు అభివృద్ధి ఉండజాలదని గమనించండి. మీ 33 లేక 34 సంవత్సరం నందు వివాహం అవుతుంది. 2019 వరకు ఏల్లాటి శనిదోషం ఉన్నందువల్ల 3 నెలలకు ఒక శనివారంనాడు 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి 19 వత్తులు ఏకం చేసి నువ్వులు నూనెతో శనిని దీపారాధన చేసినా శుభం కలుగుతుంది. 2014 నుంచి పురోభివృద్ధి పొందుతారు.