సంతానం యోగం ఉన్నది... సంతాన వేణుగోపాల వ్రతం చేయండి...
మంగళవారం, 11 సెప్టెంబరు 2012 (12:27 IST)
FILE
బి. ఈశ్వరి : మీరు పాడ్యమి సోమవారం వృశ్చికలగ్నము, జ్యేష్ట నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. ధన, సంతాన కారకుడైన బృహస్పతి లగ్నము నందు ఉండటం వల్ల సంతాన యోగం ఉంది. 2015లోపు సంతానం కలుగ గలదు. పుత్ర గణపతి వ్రతం, సంతాన వేణుగోపాల వ్రతం చేయండి. మీకు శుభం కలుగుతుంది. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించినా శుభం కలుగుతుంది.