06-06-2021 నుంచి 12-06-2021 వరకూ రాశి ఫలితాలు

శనివారం, 5 జూన్ 2021 (19:19 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ వారం అనుకూలతలున్నాయి. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో ముందుకు సాగండి. కుటుంబ విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. అధికారులకు అదనపు బాధ్యతలు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. వృత్తులవారికి ఆదాయాభివృద్ధి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
నిజాయితీని చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పత్రాలు అందుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం ప్రశాంతగా వుంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. తప్పటడుకు వేసే ఆస్కారం వుంది. ఒంటెద్దు పోకడ తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. శనివారం నాడు పనులు సాగవు. శకునాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో వ్యవహరించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులను కలుసుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. గృహమార్పు అనివార్యం. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా వుండాలి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం బాగున్నా వెలితిగా వుంటుంది. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. సన్నిహితుల హితవు మీలో మార్పు తెస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. ఖర్చులు భారమనిపించవు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం వుంది. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. గృహం సందడిగా వుంటుంది. సోమ, మంగళ వారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో వుంచుకోండి. ఎవరినీ నిందించవద్దు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. బుధ, గురు వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. న్యాయ, సాంకేతిక రంగాలవారికి ఆదాయాభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు శుభయోగం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. విదేశీయానం విరమించుకుంటారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. గుట్టుగా మెలగాలి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. బంధువుల మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. గృహమార్పు చికాకుపరుస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. జాతక పొంతన ప్రధానం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆది, గురు వారాల్లో పెద్దఖర్చు తగిలే ఆస్కారం వుంది. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు గడ్డుకాలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వాయిదా పడిని మొక్కులు తీర్చుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆచితూచి అడుగేయాలి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా వుండాలి. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యతలోపం. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. అనుకూలతలు అంతంతమాత్రమే. మీ మాటతీరు అదుపులో వుంచుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. బంధువుల రాక చికాకుపరుస్తుంది. ఖర్చులు అదుపులో వుండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. గురువారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. అధికారులకు ధనప్రలోభం తగదు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. కార్మికులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా బాగుంటుంది. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనులు త్వరితగతిన పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆది, సోమ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగాలి. ఉద్యోగస్తులకు పదవీయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం విరమించుకుంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. మీ కష్టం ఫలిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. బుధవారం నాడు పనులతో సతమతమవుతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆశించిన పదవులు దక్కవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. గృహమార్పు కలిసివస్తుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. శుభకార్యానికి హాజరవుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు