లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియచేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఖర్చులు సామాన్యం. సన్నిహితులకు సాయం చేస్తారు. మొదలు పెట్టిన పనులు ఒక పట్టాన సాగవు.
రుణ విముక్తులవుతారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. అనవసర జోక్యం తగదు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహాల సంచారం బాగుంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనులు చురుకుగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. దైవదీక్షలు స్వీకరిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో సతమతమవుతారు. శ్రమాధిక్యత, అకాల భోజనం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను నమ్మవద్దు. ఖర్చులు ప్రయోజనకరం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సోదరుల వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తుల కలయిక వీలుపడదు.
మీ కృషి ఫలిస్తుంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలను సమర్ధంగా నడిపిస్తారు. పనులు సానుకూలమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
ఖర్చులు తగ్గించుకుంటారు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. సామర్యంగా మెలగండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పట్టుదలతో శ్రమించండి. విమర్శలు పట్టించుకోవద్దు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఖర్చులు విపరీతం. పనులు ముందుకు సాగవు. ఆప్తులతో సంభాషిస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆస్తి వివాదాలు జటిలమవుతాయి.
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆప్తుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పుతో శ్రమించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. గృహమార్పు అనివార్యం. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.