16-05-2021 నుంచి 22-05-2021 వరకూ మీ వార రాశిఫలితాలు
ఆదివారం, 16 మే 2021 (19:12 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ వారం ఆశాజనకం. విమర్శలు పట్టుదలను పెంచుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేయండి. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఎదుటివారి గురించి ఉన్నతంగా మాట్లాడుతారు. కానీ వారే మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. పత్రాలు అందుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. వేడుకకు హాజరవుతారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. కార్మికులకు కష్టకాలం. విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా వుండాలి.
శ్రమాధిక్యత మినహా ఫలితం అంతంతమాత్రమే. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆశావాహ దృక్పధంతో వ్యవహరించండి. సన్నిహితుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. అయినవారే మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇంటి విషయాలు పట్టించుకోండి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఓర్పుతో వ్యవహరించాలి. ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు. మనస్సుకు నచ్చినవారితో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఖర్చులు అదుపులో వుండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. గృహమార్పు అనివార్యం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. విందులు వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మంగళ, బుధ వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. శుభకార్యంలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులు మన్ననలు అందుకుంటారు. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థిక లావాదేవీలు ముగుస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. గురు, శుక్ర వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం ఉన్నత చదవులపై నిర్ణయానికి వస్తారు. పదవులు దక్కకపోవడం ఒకందుకు మంచిదే. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. బెట్టింగులకు పాల్పడవద్దు.
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. శనివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు. సాంకేతిక వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
మీ ఓర్పునేర్పులకు పరీక్షాసమయం. పంతాలకు పోవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పట్టుదలతో వ్యవహరించండి. ఆది, గురు వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. నిస్తేజానికి లోనవుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదా మార్పు. ప్రయాణం విరమించుకుంటారు.
ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి వుండదు. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు సామాన్యం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. సోమ, మంగళ వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు.
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
మీ తప్పిదాలను సరిదిద్దుకుంటారు. మనస్సు కుదుటపడుతుంది. వ్యాపకాలు అధికమవుతాయి. పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. బుధవారం నాడు అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. వాహనం ఇతరులకివ్వద్దు.
మంచిపని చేసి ప్రశంసలందుకుంటారు. బంధువులకు మీపై దురభిప్రాయం తొలగుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. పనులు సానుకూలమవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. జాతక పొంతన ప్రధానం. పెద్దల సలహా పాటించండి. గురు, శని వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. మొహమాటాలకు పోవద్దు. కలిసివచ్చిన అవకాశం చేజారే అవకాశం వుంది. ప్రైవేట్ సంస్థలలోని వారికి కష్టకాలం. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వేడుకలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలతో హడావుడిగా వుంటారు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. ఊహించిన ఖర్చులే వుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆది, గురు వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. పిల్లల దూకుడు అదుపుచేయండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కృషి ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ప్రణాళికులు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. సోమ, మంగళ వారాల్లో ప్రముఖుల సందర్శన వీలుపడదు. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. గృహమార్పు అనివార్యం. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, ప్రశంసలు అందుకుంటారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. షేర్ల క్రయవిక్రయాలు కలిసివస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.