మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. బుద్ధిబలంతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తుంటారు. పన్ను చెల్లింపులో జాప్యం తగదు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన బదిలీ. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
గ్రహబలం సామ్యాంగా ఉంది. కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. ఉత్సాహం తగ్గకుండా శ్రమించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఆదివారం నాడు బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెటవద్దు. సామరస్యంగా మెలగండి. ముఖ్యమైన వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు మరింత శ్రద్ధగా పనిచేయాలి. అధికారుల దృష్టి మీపై పడకుండా చూసుకోండి. నిరుద్యోగులకు శుభయోగం. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు వేసుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త.
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. ఆటంకాలెదురైనా యత్నాలు కొనసాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడతుంది. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. బుధవారం నాడు పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. మీ శ్రీమతి సాయంతో ఒక అవసరం నెరవేరుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్థుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు సానుకూలమవుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆపన్నులకు సాయం చేస్తారు. పరిచయాలు మరింత బలపడతాయి. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. శనివారం నాడు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పొగిడే వారితో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆత్మీయుల ఆహ్వానం ఇరకాటానికి గురిచేస్తుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు.పాతమిత్రులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. లావాదేవీలు ప్రశాంతంగా సాగుతాయి. మీదైన రంగంలో ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుటాయి. పొదుపునకు అవకాశం లేదు. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులతో తరుచుగా సంభాషిస్తుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాన్నిస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి.
ఈ వారం శుభయోగాలున్నాయి. మీ కృషి ఫలిస్తుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. స్థిరచరాస్తుల మూలక ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో ముందుకు సాగండి. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతోషకరమై వార్తలు వింటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం కలిసివస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
గ్రహబలం సామాన్యంగా ఉంది. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. చిన్న విషయాలకే చికాకుపడుతుంటారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వీలైనంత వరకు ఆప్తులతో కాలక్షేపం చేయండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. శుక్రవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆత్మీయుల ఆహ్వానం సంతోఏషం కలిగిస్తుంది. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు బాధ్యతల మార్పు.
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. మీ కృషి ఫలిస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. స్థిరచరాస్తుల వ్యవహరంలో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ సమస్యను ఆప్తులకు తెలియజేయండి. పరిచయస్తులతో విభేదాలు రాకుడా జాగ్రత్త వహించండి. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ముందుచూపుతో తీసుకున్న పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. శుభకార్యానికి హాజరవుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు.
సర్వత్రా అనుకూలదాకం. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. కొత్త యత్నాలు మొదలెడతారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. బుధవారం నాడు కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానికి సదవకాశం లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ యత్నం నిదానంగా ఫలిస్తుంది పొదుపు ధనం అందుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అబిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గురువారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. పత్రాలు రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం సమస్యలకు దారితీస్తుంది. ఆశావహదృక్పధంతో ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరుకండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం. ఉద్యోగస్తుల పనితీరు ప్రశంసనీయమవుతుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి. సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు శనివారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు గృహంలో పందడి నెలకొంటుంది. అయిన వారితో సంతోషంగా కాలం గడుపుతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తి ఉద్యోగపరమైన బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణంలో అపరిచితులతో మితంగా సంభాషించండి.