సింహ రాశి 2021: ఆరోగ్యం, సౌఖ్యం, ప్రశాంతత, ఇంకేం కావాలి?-video

శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:10 IST)
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం: 2 వ్యయం: 14 రాజపూజ్యం: 2 అవమానం: 2
ఈ రాశివారికి గురుని సమస్త రాశి సంచారం వలన సంపూర్ణ ఆరోగ్యం, కళత్ర సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. తరచు వేడుకల్లో పాల్గొంటారు. పరిచయాలు విస్తరిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు.
 
సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. విద్యార్థులకు అవగాహనలోపం. తరచు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. పెట్టుబడులు కలిసివస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే మీ ఆశయం కార్యరూపం దాల్చుతుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. 
 
అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కళాకారులకు ప్రోత్సాహకరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు