2021 మేషరాశి: ఈ ఏడాది అంతా శుభదాయకమే... ఐతే?- video

శుక్రవారం, 18 డిశెంబరు 2020 (13:20 IST)
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం: 8 వ్యయం: 14 రాజపూజ్యం: 4 అవమానం: 3
ఈ రాశి వారికి గురుని లాభరాశి సంచార సమయంలో అంతా శుభదాయకమే. సర్వత్రా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఏ కార్యం ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మీ మాటకు గౌరవం లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పరిచయాలు బలపడతాయి. బంధువులతో సత్సంబంధాలు అంతగా వుండవు.
 
సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురయ్యే సూచనలున్నాయి. పదవుల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, నిరంతర శ్రమ తప్పదు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరాగలవు. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి.
 
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కార్మికులకు ఆశాజనకం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. వ్యవసాయ రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. ఆశించిన మద్దతు ధర లభించదు. తీర్థయాత్రలు సందర్శిస్తారు. ప్రయాణంలో చికాకులెదురవుతాయి. క్రీడ, కళాకారులకు ప్రోత్సాహకరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు