బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి తాగితే...
మంగళవారం, 23 జూన్ 2020 (22:46 IST)
బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం. ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి. తియ్యని పిండివంటలు తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ బెల్లంతో కలిగే ఉపయోగాలు ఏమిటో చూద్దాం.
1. పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
2. కాకర ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపూటల వారం రోజులు తీసుకున్నా లేదా గ్లాసు పాలలో బెల్లం వేసి రోజు త్రాగినా నెలసరి సమస్యలు ఉండవు
3. అజీర్తి సమస్యతో ఇబ్బందిపడేవారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యలుండవు
4. ముక్కు కారడంతో బాధపడుతున్న వారికి పెరుగు- బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది.
5. బెల్లం, నెయ్యి సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది.