వేసవికాలంలో లభించే పండ్లలో నేరేడు పండ్లు. మామిడి, పుచ్చకాయలతో పాటు నేరేడు పండ్లు కూడా విరివిగా లభిస్తాయి. ఈ పండు ఆయుర్వేదంలో అమరసంజీవనిగా పిలుస్తారు. ఈ పండు చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.
ఇందులో ఆమ్లాలు, ఆక్సలిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం ఉండటంతో ఈ పండుకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఈ పండ్లను ఉప్పు, చక్కెర, కారం కలుపుని తింటుంటారు. నేరేడును నీటితో శుభ్రంగా కడిగి తినాలి.
అంతేకాకుండా, ఆకులు, గింజలు ఆరోగ్యానికి రక్షణ కల్పించేవి. ఈ పండు కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉంటుంది. చూడటానికి వంకాయరంగులో మిలమిలా మెరిసి పోతు ఉంటుంది.