ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

ఐవీఆర్

శుక్రవారం, 18 జులై 2025 (22:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలోని కోలార్ పోలీసు స్టేషనులో పనిచేసే ఓ పోలీసు కానిస్టేబుల్ స్టేషనుకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళల్ని వదలడం లేదంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే ఓ వివాహిత మహిళ వెల్ఫేర్ డిపార్టుమెంటులో సమస్య పరిష్కరించాలంటూ సదరు పోలీసు వద్దకు వెళితే, మెల్లిగా ఆమెతో మాటలు పెంచుకుని సన్నిహితంగా మెలగడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వివాహిత భర్త పోలీసును హెచ్చరించాడు.
 
ఐతే పోలీసు రివర్స్ అయ్యాడు. వివాహిత భర్తను చితక్కొట్టాడు. దీనితో అతడిపై పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసాడు. ఐతే పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోగా ప్రూఫ్ ఏదంటూ నిలదీశారంటూ వాపోయాడు. దాంతో ఒకరోజు అదనుకోసం చూసిన వివాహిత భర్త.. తన భార్య-పోలీసు కానిస్టేబుల్ ఇద్దరూ కోలార్ లోని ఓ కళాశాలకు సమీపంలో వున్న అద్దె గదిలో ఏకాంతంగా గడుపుతున్నట్లు తెలుసుకున్నాడు.
 
అక్కడికి తన కుమారుడితో సహా వెళ్లి తన భార్యతో పోలీసు రాసలీలను అంతా వీడియో తీసాడు. ఆ వీడియోలను తీసుకుని పోలీసు అధికారులకు సమర్పించడంతో విషయం కాస్తా సీరియస్ అయ్యింది. సదరు పోలీసుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ బాధితుడు వాపోతున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు