Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

సెల్వి

శుక్రవారం, 18 జులై 2025 (22:47 IST)
Petrol bunk
సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బైక్​లో పెట్రోల్​ పోస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ వ్యక్తి తన బైక్​లో పెట్రోల్​ కొట్టించుకోవడానికి హుస్నాబాద్ ​మండల కేంద్రంలోని బంక్‌​కు వెళ్లాడు. బంక్​ సిబ్బంది బైక్​లో పెట్రోల్​ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. 
 
దీంతో అప్రమత్తమైన సదరు వ్యక్తి వెంటనే పెట్రోల్​ గన్​ను కింద పడేసి బైక్​పై మంటలను ఆర్పివేశాడు. అనంతరం పెట్రోల్​ గన్‌కు మంటలు అలాగే ఉండగా.. సిబ్బంది పెట్రోల్​ ఆఫ్​ చేసి ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

పెట్రోల్ పోస్తుండగా బైక్ నుంచి మంటలు.. సీసీ ఫుటేజ్ వైరల్!

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్‌లో ఘటన

బైక్‌లో పెట్రోల్ పోస్తున్న క్రమంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

అప్రమత్తమైన వాహనదారుడు.. పెట్రోల్ పైపును బైక్ నుంచి వేరు చేయడంతో తప్పిన… pic.twitter.com/Tjp7wQVX61

— BIG TV Breaking News (@bigtvtelugu) July 18, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు