ఆవనూనెతో థైరాయిడ్ సమస్యలకు చెక్...

సోమవారం, 30 జులై 2018 (14:37 IST)
పోపు గింజల్లో ఒక భాగమే ఈ ఆవాలు. వీటితో వంటలకు చక్కని వాసన, రుచి ఏర్పడుతుంది. ఆవాలలో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఈ పోపులను నూనె రూపంలో తీసుకుంటే కూడా మంచి ఫలితాలను పొందవచ్చును. మరి ఈ ఆవా నూనెలో దాగివున్న విషయాలను తెలుసుకుందాం.
 
శరీరంలో కొవ్వును కరిగించడంలో ఆవనూనె సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతోపాటు శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. దీనిని తరుచుగా తీసుకోవడం వలన అధిక బరువు తగ్గుతారు. కనుక ఆవనూనెను నిత్యం ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఈ ఆవనూనె చక్కని ఔషధంగా పనిచేస్తుంది. 
 
థైరాయిడ్, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఆవనూనె తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అలాగే జీర్ణాశయం, ప్రేగుల్లో ఇన్‌ఫెక్షన్స్ ఉన్నవారు ఈ ఆవనూనెను సేవిస్తే బ్యాక్టీరియా, వైరస్‌లు నశించి ఆరోగ్యంగా ఉంటారు. ఆవనూనెలో కొద్దిగా నిమ్మరసం, శెనగపిండి కలుపుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
చర్మంపై ఉన్న మచ్చలను తొలగించుటలో ఆవనూనె చాలా దోహదపడుతుంది. ఆవనూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని మచ్చలు, గాయాలు వంటి వాటిపై రాసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఆవనూనెను బీట్‌రూట్ జ్యూస్‌ను, పాలను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసుకుంటే పెదాల పగుళ్లు తగ్గుతాయి. అంతేకాకుండా పెదాలు ఎర్రగా కూడా మారుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు