పసుపు కలిపిన తులసీ ఆకుల రసాన్ని సేవిస్తే..? (video)

శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (19:18 IST)
Turmeric, Basil leaves Water
ఒక పాత్రలో నీటిని మరిగించి.. అందులో కాసింత తులసీ ఆకులు, పసుపు పొడి చేర్చి మరిగించాలి. ఈ కషాయాన్ని వడగట్టి రోజూ తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. దగ్గు మటాష్ అవుతుంది. తులసీ, పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తీసుకుంటే నోటి, ఉదర సంబంధిత రుగ్మతల నుంచి తప్పుకోవచ్చు. ఇంకా అజీర్తి సమస్యలుండవు. 
 
రోజు ఉదయం పరగడుపున తులసీ ఆకులు నానబెట్టిన నీటిని తాగడం ద్వారా పైల్స్, సైనస్, మానసిక ఒత్తిడి, తలనొప్పి మాయమవుతాయి. ఆస్తమా రోజులు తులసీ ఆకుల నీటిలో పసుపు పొడి కలిపి ఆ నీటిని మరిగించి సేవించడం ద్వారా శ్వాస సమస్యలు వుండవు. 
 
తులసీ, పసుపు మరిగించిన నీటిని రోజు పరగడుపున తీసుకుంటే ఒబిసిటీ వుండదు. నరాల బలహీనతకు ఈ నీరు మెరుగ్గా పనిచేస్తుంది. మెదడుకు రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. తులసీ, పసుపు నీటిని సేవించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదరంలోని అసిడిటీ కారకాలను ఇది దూరం చేయడం ద్వారా అసిడిటీని తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు