బ్రకోలీ రుచికరమైన పోషకమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగిఉంది. ఇది కొలెస్ట్రాల్, అలర్జీలు, కీళ్లనొప్పులు వంటి వ్యాధులను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వలన వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్స్, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి.
ఇది అధిక బరువును తగ్గిస్తుంది. బ్రకోలీ కోలన్ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ప్రతిరోజు బ్రకోలీ తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విటమిన్ సి, కె అధికంగా అందుతాయి. ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివలన ఆహార పరిణామం తగ్గిపోతుంది. బరువు తగ్గడానికి మాత్రమే బ్రకోలీని తీసుకోవడం సరికాదు.