నల్ల నువ్వులను వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా వుండవచ్చు. రెండు రోజులకు ఒక గుప్పెడు నల్ల నువ్వులను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నల్ల నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని యాంటీయాక్సిడెంట్లు, ఒమెగా త్రీ ఫ్యాట్స్, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎలు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.
మహిళలు రోజూ నల్ల నువ్వులను తీసుకోవచ్చు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. పేగు క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్‌లకు కూడా ఇది చెక్ పెడుతుంది. పేగుల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొడుతుంది. తెలుపు నువ్వుల కంటే నలుపు నువ్వులే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీరంలోని ట్యాక్సిన్లను తొలగిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. హెయిర్ ఫాల్ సమస్యను లేకుండా చేస్తాయి.