మునగ పువ్వుల పొడిని వేడి వేడి అన్నంతో కలిపి తీసుకుంటే?

సోమవారం, 23 డిశెంబరు 2019 (12:56 IST)
మునగ చెట్టు ఆకులు, చెక్కలు, వేర్లు, కాయలన్నింటిలోనూ ఔషధ గుణాలు వున్నాయి. వీటిలో కడుపు నొప్పికి మునగ పువ్వులు ఎంతో మేలు చేస్తాయి. కడుపు నొప్పి వేధిస్తుంటే.. మునగపువ్వుల కషాయం మెరుగ్గా పనిచేస్తుంది. 
 
మునగ పువ్వుల్ని పేస్టు చేసుకుని పాలులో మరిగించి.. బెల్లం కలుపుకుని తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మునగ పువ్వులను నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. రోజూ నీటిలో మరిగించి ఉదయం, సాయంత్రం తీసుకుంటే పిత్త సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. అలసట నయం అవుతుంది. 
 
మునగ పువ్వులను నీటిలో మరిగించి రోజూ రెండు పూటలా తీసుకుంటే నరాలకు సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చు. మునగపువ్వుల పొడిని వేడి వేడి అన్నంలో చేర్చి తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. నెలసరి ఇబ్బందులతో బాధపడేవారు.. మునగ పువ్వులతో కషాయం తాగితే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు