యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదే యాలకుల ఆయిల్ ద్వారా మసాజ్ చేసుకుంటే రొమాంటిక్ ఆలోచనలు ఉత్పన్నమవుతాయని, నపుంసకత్వం తగ్గుతుంది. ఇంకా లైంగిక స్పందనను పెంచే సినియోలే అనే పదార్థం యాలకుల్లో ఉంటుందని.. తద్వారా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యాలకుల నూనె క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుందని వారు చెప్తున్నారు.
ఇంకా ఆహారంలో యాలకులను చేర్చుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. వికారం, కడుపుబ్బరం, ఆకలి మందగించడం లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు యాలకులను వాడటం మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో యాలకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి.
ఇంకా యాలకులు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. నోటిపూతకు చెక్ పెడతాయి. యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. జలుబూ, దగ్గు లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడూ యాలకులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే అవి క్రమేణా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.