ఆయుర్వేదంలో కీలకమైన జాజికాయ, అశ్వగంధ శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. అశ్వగంధలో శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణం ఎక్కువగా ఉంది. నిత్యం కొంత అశ్వగంధ పొడిని పాలలో కలుపుకుని తాగుతుంటే శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఉత్తేజంగా ఉంటారు. రతి క్రీడలో చురుగ్గా పాల్గొంటారు. కేవలం 15 రోజుల పాటు ఈ పొడిని వాడితే ఫలితం ఉంటుంది.
అలాగే పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణాలు జాజికాయలో ఉన్నాయి. వీటి పొడిని రోజూ పాలలో కలుపుకుని తాగితే ఆ శక్తి పెరగడమే కాదు, వీర్య వృద్ధి అవుతుంది. దీంతో సంతానం కలిగేందుకు అవకాశం ఉంటుంది. నరాల బలహీనత ఉంటే పోతుంది. వెల్లుల్లిని పచ్చిగా తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అలాగే అల్లం రసాన్ని తీసి రోజూ తాగుతుంటే శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది. వీర్య వృద్ధి అవుతుంది.