ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కటి వైద్యశాల వంటిది మన వంటగది. అదెలాగంటే... ఇక్కడే అన్ని దినుసులు వుంటాయి. కొన్నింటిని మనం బయట నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుని వాడుకుంటుంటాం. ఇకపోతే ఇప్పుడు కరక్కాయ వల్ల కలిగే ఫలితాలేమిటో చూద్దాం.
* ఒకటి రెండు చెంచాల కరక్కాయ పొడిని భోజానికి ముందు మజ్జిగతో సేవిస్తే స్థూలకాయం తగ్గిపోతుంది.
* పసుపుకొమ్ము రసాన్ని ఇనుప పాత్రలో వుంచి వేడి చేస్తూ, కరక్కాయ కల్కాన్ని చేర్చి బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం లేపనంగా వేస్తే గోరుచుట్టు వాపు తగ్గుతుంది.
* కరక్కాయ ఒక భాగం, వేయించిన పిప్పళి చూర్ణం సగభాగం రెండూ కలిపేయాలి. దీనిలో నుంచి ఒక గ్రాము చూర్ణాన్ని తేనెతో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి చెప్పున సేవిస్తుంటే కోరింత దగ్గు తగ్గిపోతుంది.