పురుషుల్లో శృంగార సమస్యలకు చెక్ పెట్టే పాలకూర..

గురువారం, 4 మే 2017 (12:36 IST)
శృంగార లోపాలను దూరం చేసుకోవాలంటే పాలకూర తినాలి. ఈ ఆకులో ఉండే ఫోలిక్ యాసిడ్ పురుషుల్లో వీర్య వృద్ధికి సహాయపడుతుంది. ఇందులో ఫోలిక్ ఆమ్లంతో పాటు విటమిన్ సి, ఐరన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను కూరగా కాకుండా.. ఆకును మిక్సీలో వేసి.. గ్రైండ్ చేసి ఒక గ్లాసు తాగినట్టయితే శృంగార సమస్యలు తొలగిపోతాయి. 
 
అలాగే మిరపకాయల్ని వంటల్లో చేర్చుకోవడం ద్వారా పురుషుల్లో సంతానోత్పత్తి వృద్ధి చెందుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేసవిలో మితంగా తీసుకోవాలని.. సంతానం లేని వారు మిర్చిని తగిన మోతాదులో ఆహారంలో చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే మహిళలు కూడా పాలకూరను తీసుకోవాలి. పాలకూరలో క్లోరిన్, ప్రోటీన్లు, విటమిన్ ఏ, సిలు, ఖనిజ లవణాలు, కాల్షియంలు లభిస్తాయి. దీనిని తినడం వల్ల రక్తహీనతకు చెక్ పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో పాటు అధిక రక్తపోటును తగ్గించి, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
 
పాలకూర రసాన్ని తాగడం వల్ల జుట్టు అందంగా ఉంటుంది. జుట్టు ధృడంగా, పొడవుగా పెరుగుతుంది. వెంట్రుకలకు అవసరమైన పోషకాలు ఇందులో లభిస్తాయి. శరీరానికి అవసరమైన ఐరన్‌ను పుష్కలంగా అందిస్తుంది. కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి