కవిత దొరసాని కాదని మా పార్టీలో చేరి నిరూపించుకోవాలి : కేఏ పాల్ ఆహ్వానం

ఠాగూర్

శనివారం, 6 సెప్టెంబరు 2025 (09:03 IST)
ఇటీవల భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కె.కవితకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ పార్టీలో చేరి ఆమెకు ఇష్టమైన పదవిని స్వీకరించవచ్చని ఆయన సూచించారు. 
 
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కవితను భారాస అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్ బహిష్కరించారు. ఈ నేపథ్యంలో కవితకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీలోకి కవితను ఆహ్వానించారు. కవితను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
 
"కేసీఆర్ కూతురు కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేశారు. బీసీల కోసం పోరాడుతానని కవిత చెబుతోంది. కవిత.. నిజంగా నీవు బీసీల కోసమే పోరాడాలంటే ఇపుడు బీసీల కోసం ఉన్న ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ. ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణం కాదని రుజువు చేసుకో. 
 
బీజేపీ బ్రహ్మణుల పార్టీ. కాంగ్రెస్ రెడ్ల పార్టీ, దొరసానివైన నిన్ను ప్రజలు నమ్మాలంటే గద్దరన్న చేరిన పార్టీ ప్రజాశాంతి పార్టీలో చేరు. ప్రజాశాంతి పార్టీలోకి రా. జూబ్లీహిల్స్‌లో పోరాడుదాం. రుజువు చేసుకుందాం. అందరి మనసులు గెలుచుకుందాం అని కవితకు కేఏ పాల్ ఆహ్వానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు