పరగడుపున పది కరివేపాకు ఆకుల్ని నమిలి మింగేస్తే?

గురువారం, 2 మార్చి 2017 (17:15 IST)
కరివేపాకే కదా అని తీసిపారేయకండి. అందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగివున్నాయి. కరివేపాకులో విటమిన్ ఎ, బీ, సీలతో పాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది. అయామన్, అమినో యాసిడ్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వందగ్రాముల కరివేపాకును రుబ్బుకుని రసం పిండుకుని వంద గ్రాముల టెంకాయ నూనెలో కలుపుకుని గోరువెచ్చని వేడిలో తేమ పోయేంతవరకు మరిగించి.. రోజూ తలకు ఆ కొబ్బరినూనెను రాసుకుంటే.. శరీరంలోని వేడి తగ్గుతుంది. తెల్లవెంట్రుకలుండవు. కంటి చూపు మెరుగుపడుతుంది. 
 
ఇంకా కరివేపాకు పేస్టును రోజూ పరగడుపున తీసుకుంటే.. ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన రోగాలను దూరం చేసుకోవచ్చు. బరువును తగ్గించుకోవచ్చు. పొట్టను కూడా తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పరగడుపున పది కరివేపాకు ఆకుల్ని నమిలి మింగేస్తే.. మూడు నెలల్లో తప్పకుండా పొట్ట తగ్గిపోతుందని వారు సలహా ఇస్తున్నారు. 
 
ఇంకా డయాబెటిస్‌ను తరిమికొట్టాలంటే ఉదయం-సాయంత్రం పూట కరివేపాకుల్ని నమిలి తింటే.. మాత్రలు తీసుకోవాల్సిన పనివుండదు. కరివేపాకు రక్తంలోని కొవ్వును తగ్గిస్తుంది. కరివేపాకుల్ని అలాగే నమిలి తినడం ద్వారా గొంతు ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. జలుబు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి