శుక్రవారం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట వరకు వర్షాలు కురుస్తాయని అంచనా. ప్రభావిత ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేయడం జరిగింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది.
గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని, చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.