బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావుకు ఒకయేడాది జైలుశిక్ష పడింది. ఈ మేరకు విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు (కాఫిఫోసా) ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో రన్యారావుతో పాటు మరో ఇద్దరు నిందితులైన తరుణ్ కొండారు రాజు, సాహిల్లలకు కూడా ఇదే శిక్ష విధించినట్లు బోర్డు తెలిపింది.
ఈ కేసు విచారణ సమయంలో ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేసి రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఇక, అక్రమంగా బంగారం తరలించడంలో రన్యారావు సహచరులైన తరుణ్ కొండూరు రాజు, సాహిల్ జైన్లు కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో వారిని కూడా అధికారులు అరెస్టు చేశారు.